కొలంబస్‌లో ఘనంగా తానా పద్యార్చన
కొలంబస్ ఒహాయోలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో, కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో జనవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొలంబస్‌లో ఉన్న పొలారస్, పోవెల్‌లో ఉన్న పాఠశాల కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని అమ్మా, నాన్న, గురువు శతక పద్యాలను చదివారు. ఈ కార్యక్రమం విజయవంతానికి పాఠశాల ఏరియా డైరెక్టర్ కాళి ప్రసాద్ మావులేటి కృషి చేశారు. సెంటర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ పానుగంటి, టీచర్లు కళ్యాణి మావులేటి, హరిక బల్లేకరి, విశ్వేశ్వరి పిచిక, చంద్రిక నల్లమోతు, శర్వాణిచలంచల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా నాయకులు శ్రీనివాస్ యలవర్తి తదితరులు కూడా కార్యక్రమానికి వచ్చారు.
Tags :