తానా శతకపద్యార్చనలో పాల్గొన్న బే ఏరియా పాఠశాల విద్యార్థులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సంయుక్త నిర్వహణలో జనవరి 6 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ''అమ్మ నాన్న గురువు-శతక పద్యార్చన'' కార్యక్రమంలో బే ఏరియా పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బే ఏరియా పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన, తానా రీజినల్ నాయకుడు రజనీకాంత్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.
ఈ పద్యాలను మధురంగా గానం చేసేలా ట్యూన్‌లను సమకూర్చిన శ్రీమతి గీతకు పాఠశాల నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. సన్నివేల్ పాఠశాల టీచర్లు ఉమ గాయత్రి, ధనలక్ష్మీ, లక్ష్మీ సువర్ణ, మానస, శాన్‌రామన్-డబ్లిన్ టీచర్లు రజిత కె రావు, కళ్యాణి చికోటి, శరత్ పోలవరపు, అర్చన చాద, శిరీష్ అతి తక్కువ సమయంలో విద్యార్థులకు ఈ పద్యాలపై అవగాహన కల్పించి వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కృషి చేశారు. తానా నాయకులు రజనీకాంత్ కాకర్ల వెంకట్ కోగంటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.