ASBL Koncept Ambience

రాజా కసుకుర్తి అధ్వర్తంలో వీరవల్లి గ్రామంలొ తానా సేవా కార్యక్రమాలు

రాజా కసుకుర్తి అధ్వర్తంలో వీరవల్లి గ్రామంలొ తానా సేవా కార్యక్రమాలు

సాయం చేసే గుణం అందరికి ఉండదని అలాంటిది స్వంత గ్రామాభివృద్ది పాఠశాల అభివృద్ధికి తన తోడ్పాటుని అందిస్తున్న తానా కమ్యూనీటి సర్వీసెస్ కో ఆర్డినేటర్ కసుకుర్తి రాజా సేవలు మన అందిరికి స్ఫూర్తిదాయకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అన్నారు. విదేశాల్లో స్ధిరపడిన జన్మభూమి పట్ల మమకారాన్ని మరిచి ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలలో తానా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి కొనియాడారు.

బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్ లో తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సుమారు 8లక్షల రూపాయలతో  సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్డుని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి పలువురు ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రారంభించారు. విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు, రైతులు స్పేయర్లు, కిట్లు, దుప్పట్లు అందజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయరాలు నిర్మల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామని అమెరికాలో ఉంటూ సొంత ఊరిని, చదుకున్న పాఠశాలను మరిచిపోకుండా సైకిల్ షెడ్ నిర్మించిన కసుకుర్తి రాజాకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు.

తానా ఆధ్వర్యంలో మన ప్రవాసాంధ్రులు విదేశాల్లో స్ధిరపడిన జన్మభూమికి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీ  కొనియాడారు.  విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని కులం,మతం తేడాలేకుండా ఏ స్థాయిలో ఉన్న వారుకైనా సమానంగా నిలబెట్టేది ఒక్క విద్య మాత్రమే అన్నారు. పుట్టిపెరిగిన ఊరు, చదివిన పాఠశాల మరచిపోకూడదు అనే ఉద్దేశ్యంతో పాఠశాల్లో సైకిల్ షెడ్ నిర్మాణం చేయడం జరిగిందని కసుకుర్తి రాజా తెలిపారు. షెడ్ ను ఎమ్మెల్యే వంశీ చేతులు మీదగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చి ఉన్నత చదువులు చదివి ఎంత ఎదిగినా రైతులను మరువకూడదు అనే ఉద్దేశ్యంతో పవర్ స్పేర్ లు, మందులు పిచికారీలో ఉపయోగించే రక్షణ కిట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు తానా ఆధ్వర్యంలో అందిస్తున్నామని కసుకుర్తి రాజా అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుకుంటున్నామని విద్యార్థులు చిన్నచూపుగా భావించవద్దని నేను, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇక్కడ ఉన్నవారంతా ప్రభుత్వ బడుల్లో చదువుకుని మంచి స్ధాయిలో స్ధిరపడ్డామని మీరు బాగా చదవి ఉన్నత స్ధాయిలో స్ధిరపడాలన్నారు.

కసుకుర్తి రాజా శ్రీమంతుడులా పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు ఇలాంటి వ్యక్తి మీ గ్రామంలో ఉండటం గ్రామానికే గర్వకారణమని లావు అంజయ్య చౌదరి అన్నారు. తానా నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జన్మభూమిలో మెగా క్యాన్సర్ క్యాంపు, వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం, రైతు కోసం అనాధ పిల్లలకు దుస్తులు,పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో తెలుగువారు ఎదైనా రోడ్డు ప్రమాదం, అనారోగ్య సమస్యలతో, హత్యకుగురైనా మృతదేహాలు స్వస్ధలాలకు పంపించటంమేకాక వారికి ఆర్ధిక సాయం చేస్తోందన్నారు. ఎదైనా సమాచారం వస్తే తక్షణంమే స్పందించి తానా సభ్యులు 24 / 7 పనిచేస్తోందన్నారు. ఎన్నో వేలాది మంది సభ్యులు గల తానా సేవలు ముందకు దూసుకుపోతుందన్నారు. అంతరించిపోతన్న సంస్కృతి సంప్రదాయాల మరల మనవారికి పరిచయం చేసేందకు తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో సాంస్కృతి కళోత్సవాలు దోహదపడతాయని అంజయ్య చౌదరి అన్నారు.  

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నగేష్ జడ్పిటిసి గంగాభవానీ, నక్కా గాంధీ, అవిర్నేనే శేషగిరి, చిలకపాటి పద్మనాభం, హెచ్ ఎం నిర్మల, సర్పంచ్ పిల్లా అనిత, గూడవల్లి రత్న సుధాకర్, కలపాల రాజబాబు, అత్మూరి బాలాజీ, కోడేబోయిన బాబీ, పిఏసిఎస్ ఛైర్ పర్సన్ అల్లాడి ధెరిస్సా. పాఠశాల అభివృద్ది ఛైర్మ మద్ది రామమ్మ, వైస్ ఛైర్మన్ చందు రాజా, ఎంపీపీ చందురమాదేవి, ఎంపిటిసీలు దూసరి నిర్మల, అమృతపల్లి సూర్యానారాయణ, పూర్వ విద్యార్ధి లింగమనేని రాజారావు, ఎంపిడో ప్రభాకారావు, ఏఈ జయరాజు, ఈవో శ్యామలరావు,  పిల్లా రామారావు, ఉపసర్పంచ్ లంక అజేయ్ రాయి శివపార్వతి తోమండ్రు రమేష్ మోర్ల, అంజనేయలు, గండి చిన్నారావు పాఠశాల ఉపాధ్యాయలు, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery

 

 

 

Tags :