తానా సౌత్ వెస్ట్ అస్టిన్ టీమ్ సేవ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సౌత్ వెస్ట్అస్టిన్ టీమ్ కోవిడ్ 19 బాధితులకు సహాయపడుతున్న పోలీసుల సేవలను ప్రశంసిస్తూ వారికి లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభినందించింది. టెక్సాస్ పోలీస్ డిపార్ట్మెంట్‍వారికి అస్టిన్ టీమ్ లంచ్‍ను ఇచ్చింది. ఈ కార్యక్రమం ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, ఇవిపి అంజయ్య చౌదరి లావు, తానా సెక్రటరీ రవి పొట్లూరి తదితరులకు అస్టిన్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భగవత్, లెనిన్ ఎర్రం, చిరు ముప్పనేని, సుధమంత్రాల తదితరులు పాల్గొన్నారు.
Tags :