న్యూజెర్సిలో తానా క్రీడా పోటీలు సక్సెస్
తానా 23వ మహా సభలను పురస్కరించుకుని న్యూజెర్సీలో తానా స్పోర్ట్స్ మీట్ ని శ్రీరామ్ ఆలోకం స్పోర్ట్స్ చైర్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకట్ పొత్తూరు మాట్లాడుతూ అమెరికా రాష్ట్రాలు, కెనడా నుంచి దాదాపు వేయిమందికిపైగా క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. యునైటెడ్ స్టేట్స్‌లోని పాఠశాలలు మరియు కళాశాలలలో, క్రీడలకు విద్యావేత్తలతో సమానంగా విలువ ఇస్తారని, విద్యలో భాగంగా క్రీడలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న 23వ తానా మహాసభలో భాగంగా ఈ క్రీడలన్నీ నిర్వహించినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ క్రీడలు యువత మరియు పిల్లల మానసిక వికాసానికి దోహదపడతాయని యువ తరానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంతోపాటు క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఈ పోటీలను నిర్వహించామని చెప్పారు.
ఈ ఈవెంట్లలో భాగంగా క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, త్రో బాల్, టెన్నిస్, చెస్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లు నిర్వహించారు. స్పోర్ట్స్ మీట్ భవిష్యతులో చాల జరగాలని స్పోర్ట్స్ మీట్ స్పాన్సర్ చేసిన వంశీ కోట, తానా కాన్ఫరెన్స్ ఓవర్సీస్ డైరెక్టర్ మరియు క్రాంతి ఆలపాటి తేలిపారు.ఈ సందర్భంగా భారతీయ వాలీబాల్ క్రీడాకారుడు రామకృష్ణంరాజు ముదునూరుని తానా సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ క్రీడలు విజయవంతం కావడానికి దేవినేని లక్ష్మి, రాజా కసుకుర్తి, వంశీ వాసిరెడ్డి, రామకృష్ణ వాసిరెడ్డి , శశాంక్ యార్లగడ్డ, శ్రీనాథ్ కోనంకి తమవంతు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించిన చంద్రశేఖర్ కొండపల్లి, పవన్ తాత, నాయుడు ఎర్లే, సందీప్ రెడ్డి కొట్టం, ప్రసాద్ దాసరి, హరిబాబు గంగవరపు, విజయ్ ముసునూరి, చిరంజీవి బోడెంపూడి, వంశీ పొట్లూరిలను శ్రీరామ్ ఆలోకం ప్రశంసించారు. కో-చైర్మన్ లుగా ఉన్న హరీష్ కూకట్ల, చలం పావులూరి, కోఆర్డినేటర్లుగా కృష్ణమోహన్ అమిరినేని, సిద్ధార్ధ్, హరిణి పొట్లూరి, దొరబాబు ఆకుల, వెంకట్ చిమ్మిలి, శ్రీని పెద్ది, కృష్ణ యామిని ఈ పోటీలను సమర్ధవంతంగా నిర్వహించారు.