తానా మహాసభలకు కేటీఆర్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2017 మే 27 నుంచి 29వ తేదీ వరకు సెయింట్ లూయిస్‌లో నిర్వహించే మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావును తానా నాయకులు ఆహ్వానించారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన, తానా 2017 మహాసభల కన్వీనర్ కూర్మనాథ్ చదలవాడ, చలపతి కొండ్రకుంట, తానా సభ్యులు సుబ్బారావు చెన్నూరి, రఘు మేక, వెంకట్ టీవి తదితరులు కేటీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ తానా అమెరికాలోనూ, మాతృరాష్ట్రాల్లోని తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న సేవలు ప్రశంసనీయమంటూ, ఈ మహాసభలకు తాను తప్పకుండా వస్తానని హామి ఇచ్చారు.
Tags :