యాదాద్రి టెంపుల్‌ను దర్శించిన తానా నాయకులు
తెలంగాణలో అద్భుతంగా తీర్చిదిద్దిన యాదాద్రి ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు సందర్శించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, 23వ తానా కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరు, చైతన్య స్రవంతి కన్వీనర్ సునీల్ పాంత్ర, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గూదే, రాజా కసుకుర్తి, సురేష్ కాకర్ల, ఠాగూర్ మల్లినేని, చెన్నూరి సుబ్బారావు గారితో పాటు పలువురు తానా సభ్యులు యాదాద్రిని సందర్శించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, ఈ క్షేత్ర సందర్శన తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించిందని ప్రశంసించారు.
Tags :