ఖమ్మంలో తానా-బత్తినేని ఆధ్వర్యంలో 18న సాంస్కృతిక ప్రదర్శన
తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో డిసెంబర్ 18వ తేదీన సాంస్కృతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పంత్ర, ఉత్సవ నిర్వహణకర్త బత్తినేని ప్రకాష్ తెలిపారు. బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 250 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారని, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్ రమణ తదితర తానా నేతలు ఈ ఉత్సవానికి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. రాజన్న డోలు, యక్షగానం, కొమ్మకోయ, బుర్రకథ, కోలాటం పోతురాజుల విన్యాసాలు వంటివి ఇందులో ప్రదర్శించనున్నట్లు వారు చెప్పారు.
Tags :