ఛార్లెట్ లో తానా టెన్నిస్ టోర్నీ సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ టీమ్ హార్నెస్ట్ నెస్ట్ పార్క్‌లో నిర్వహించిన టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతమైంది. 32 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. దీంతో టోర్నమెంట్ పోటాపోటీగా సాగి అందరినీ ఎంతో ఆకట్టుకుంది. కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ మల్లిఖార్జున వేమన, ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ చాంద్ గొర్రెపాటి, బ్యాక్‌ప్యాక్ కో చైర్ నాగ పంచుమర్తి, పట్టాభి కంఠమనేని, సురేష్ చలసాని, రమణ అన్నె, రాము రెడ్డి కోడం, వెంకట్ సురేష్ బాబు అలహరి తదితరులు ఈ టోర్నమెంట్ విజయానికి కృషి చేశారు. శివ కాసర్ల, భాష, సతీష్ వలంటీర్లుగా వ్యవహరించారు. విజయవంతమైన టోర్నమెంట్‌ను నిర్వహించిన ఛార్లెట్ టీమ్‌ను అధ్యక్షుడు జే తాళ్ళూరి అభినందించారు.
Tags :