ASBL Koncept Ambience

తానా టెన్నిస్ పోటీల్లో విజేతలు వీరే

తానా టెన్నిస్ పోటీల్లో విజేతలు వీరే

ఉత్తర అమెరికా తెలుగుసంఘం వాషింగ్టన్‌ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే 22వ మహాసభలను  పురస్కరించుకుని వివిధ పోటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో జూన్‌ 9వ తేదీన టెన్నిస్‌ పోటీలను నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన ఈ పోటీల్లో వర్జీనియా, మేరీలాండ్‌, డీసీకి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

సింగిల్స్‌, డబుల్స్‌ విభాగంలో జరిగిన ఈ పోటీలను రాజేష్‌ కాసరనేని నిర్వహించారు. శ్రీకాంత్‌ తుమ్మల, సువీర్‌ వీరన్నగారి, కిషోర్‌ పెన్మెత్స, సుధీర్‌ బండారు, సతీష్‌ చింత, కిరణ్‌ కర్ర, భాను ఇమ్మది, రాజేష్‌ అన్నె, రామ్‌ గూడవల్లి తదితరులు ఈ పోటీల నిర్వహణకు కృషి చేశారు. బాయ్స్‌ సింగిల్స్‌లో హర్షిత్‌ అంథం, శ్రీకాంత్‌ రెడ్డి విజేతలుగా నిలిచారు, టీన్స్‌ సింగిల్స్‌లో సిద్ధార్త్‌ రవికాంతి, పీయూష్‌ పోకాల, డబుల్స్‌ విభాగంలో సిద్ధార్థ్‌ రవికాంతి, పీయూష్‌ పోకాల,నాగసాయి శ్రీయాష్‌, శ్యామనాథ్‌ కుడుం, మెన్స్‌ డబుల్స్‌లో నవీన్‌ చెన్నుపాటి, చిట్టి కోరుకొండ, శ్రీనివాస్‌ జుజ్జూరు, కార్తీక్‌ ప్రబల, ఉమెన్స్‌  సింగిల్స్‌లో బింది బొల్లు, శైలజ అంగిరేకుల విజేతలుగా నిలిచారు. విజేతలను తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌ మూల్పూరి వెంకటరావు, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నరేన్‌ కొడాలి అభినందించారు.

 

Tags :