రేపల్లెలో తానా మాస్క్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానాఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధప్రదేశ్‍లోని రేపల్లెలో తానా మాస్క్లను పంపిణీ చేశారు. ఒకసారి వాడిన తరువాత మళ్ళీ ఉతికి ఈ మాస్క్లను ధరించవచ్చు. ఇలాంటి మాస్క్లను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి, రేపల్లె రెడ్‍క్రాస్ బ్లడ్‍బ్యాంక్ సిబ్బందికి, రేపల్లె ప్రింట్, డిజిటల్ మీడియా రిపోర్టర్లకు, ఇతరులకు తానా ప్రతినిధులు అందజేశారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా పాస్ట్ ప్రెసిడెంట్ సతీష్ వేమన, తానా ఇవిపి అంజయ్య చౌదరి, తానా సెక్రటరీ రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ తానా ఆర్‍విపి సతీష్ చుండ్రు, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, రవి మందలపు, రవిసామినేని, వెంకట్‍యార్లగడ్డ, నాగరాజు నలజుల, సాయి జరుగుల, రేపల్లె ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్‍చైర్మన్ డా. వసంతం వీర రాఘవయ్య తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ఫణికుమార్ కంతేటి తెలిపారు.