కేర్స్ యాక్ట్ పై తానా వెబ్ సెమినార్
అమెరికా ప్రభుత్వం ప్రకటించిన 2 ట్రిలియన్ డాలర్ల బిల్లులో ఉన్న అంశాలపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒక వెబ్ సెమినార్ ను ఏర్పాటు చేసింది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన కేర్స్ యాక్ట్ లోని వివిధ అంశాలపై ఎజి ఫిన్‍టాక్స్ కు చెందిన సిఇఓ, ఫౌండర్ అనిల్ గ్రంథి తెలియజేస్తారు. ఎస్‍బిఎ డిజాస్టర్ లోన్స్ కింద బిజినెస్ ఓనర్లకు ఇచ్చే లోన్ విషయాలు, వడ్డీరేట్లు, వర్కింగ్ క్యాపిటల్ తదితర అంశాలపై ఆయన సవివరంగా తెలియజేస్తారని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, తానా సెక్రటరీ రవి పొట్లూరి, తానా ట్రెజరర్ సతీష్ వేమూరి తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మల్లివేమన, తానా నార్త్ వెస్ట్ రీజినల్ కో ఆర్డినేటర్ దేవేంద్రలావు, మహేష్, సురేంద్ర తదితరులు చూస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లింక్‍లు ఇక్కడ ఇచ్చాము
Meeting Link : https://bit.ly/2QPwjmH
Join by Phone US : +1-408-418-9388 Access Code : 793 113 237