భారతీయం సత్యవాణితో తానా మాటామంతి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నారైలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు వీలుగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. భారతీయం సత్యవాణిగారితో మాటామంతి...పేరుతో ఓ వెబ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సమావేశం జరుగుతుంది. సమస్య...సందర్భం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తానా సభ్యులు అందరూ పాల్గొనాలని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి కోరారు. క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో కలసికట్టుగా లక్ష్యాన్ని సాధించడంపై ఇందులో సత్యవాణి సూచనలు చేస్తారని ఆయన తెలిపారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరితోపాటు, ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి, ట్రెజరర్ సతీష్ వేమూరి, తానా ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మల్లి వేమన, న్యూయార్క్ రీజినల్ కో ఆర్డినేటర్ సుమంత్ రామ్ సెట్టి, న్యూజెర్సికి చెందిన రీజినల్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి, రేఖ ఉప్పులూరి, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఈ?కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను చూశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లింక్‍లు ఇక్కడ ఇచ్చాము.
Meeting Link:
https://tana.webex.com/tana/j.php?MTID=ma5bae5f9ac0118fefa3a12a8ee72621a
(or)
Join by phone
USA: +1-408-418-9388
Access code: 799 597 346
Date & Time: Wednesday April 1st, from 8 PM EST to 9:30 PM EST.