తానా వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో ఫ్రంట్‍లైన్ సిబ్బందికి అభినందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో బే ఏరియాలో కరోనా పేషంట్లకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్‍లైన్ సిబ్బందిని అభినందిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ సర్వీసెస్ (వేస్ట్ అండ్ ట్రాష్) సిబ్బందికి లంచ్ ఇస్తూ వారికి ప్రశంసలను తానా వెస్ట్ టీమ్ తెలియజేసింది. ఈ కార్యక్రమానికి జయరామ్ కోమటి, సతీష్ వేమూరి, భక్త బల్లా, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకరాల, కృష్ణ గొంప, గోకుల్, నందు సహకరించారు. తానా నాయకులు జయ్ తాళ్ళూరి, నిరంజన్ శృంగవరపు, అంజయ్య చౌదరి లావు తదితరుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా నాయకులు తెలిపారు. కృష్ణ గొంప ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు.
Tags :