ASBL Koncept Ambience

స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేసిన తానా వెస్ట్‌ టీమ్‌

స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేసిన తానా వెస్ట్‌ టీమ్‌

కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో పేద పిల్లలకు తానా ఆధ్వర్యంలో స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. దాదాపు 384 బ్యాగ్‌లను నెవార్క్‌లోని హెచ్‌ఎ స్నో ఎలిమెంటరీ స్కూల్‌లో పంపిణీ చేసినట్లు తానా నాయకులు తెలిపారు. తానా మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ కోగంటి, రజనీకాంత్‌కాకర్ల, భక్తబల్లా, గోకుల్‌ రాచిరాజు, లక్ష్మీపతి గాదిరాజు, వెంకట్‌ అడుసుమిల్లి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :