ఫ్రీమాంట్ లో వైద్యసిబ్బందికి బ్రేక్‍ఫాస్ట్ ఇచ్చిన తానా వెస్ట్ టీమ్
కోవిడ్ 19 పేషంట్ల బాగుకోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసిస్తూ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో ఫ్రీమాంట్‍లో దాదాపు 150 మంది వైద్యసిబ్బందికి బ్రేక్‍ఫాస్ట్ ఇచ్చారు. ఫ్రీమాంట్‍లోని కైజర్‍లో ఈ?కార్యక్రమం జరిగింది. విపత్కాలంలో వారు చేస్తున్న సేవలు శ్లాఘనీయమని తానా మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి అన్నారు. తానా వెస్ట్ టీమ్ నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, భక్తబల్లాతోపాటు వీరు ఉప్పల, భాస్కర్ వల్లభనేని, సుధాకర్ రావూరి, శ్రీని తదితర స్థానిక నాయకులు ఈ?కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, అంజయ్య చౌదరి, రవి పొట్లూరి తదితరుల మద్దతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, ఈ బ్రేక్‍ఫాస్ట్ను స్పాన్సర్ చేసిన సతీష్ వేమూరికి ప్రత్యేక ధన్యవాదాలను తానా వెస్ట్ టీమ్ తెలియజేసింది.