ASBL Koncept Ambience

తానా విల్ అండ్ ట్రస్ట్ సెమినార్ కు భారీ స్పందన

తానా విల్ అండ్ ట్రస్ట్ సెమినార్ కు భారీ స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మార్చి 22వ తేదీన నిర్వహించిన విల్‍ అండ్‍ ట్రస్ట్ వెబ్‍ సదస్సుకు భారీ స్పందన వచ్చింది. కె అండ్‍ కే లీగల్‍ అసోసియేట్స్ కు  చెందిన సునీత క్రోసూరి ట్రస్ట్, విల్‍ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఎస్టేట్‍ ప్లానింగ్‍ ను అమలు చేయడానికి ఉన్న వనరులను ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. తానా ఇలాంటి విషయాలపై వెబ్‍సదస్సును నిర్వహించినందుకు అందరూ తానాను అభినందించారు.

తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, తానా బోర్డ్ చైర్మన్‍ హరీష్‍ కోయ, తానా సెక్రటరీ రవి పొట్లూరి ఈ వెబ్‍ సదస్సులో పాలుపంచుకున్నారు. తానా ప్రెసిడెంట్‍ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, ఇంటర్నేషనల్‍ కో ఆర్డినేటర్‍ లక్ష్మీ దేవినేని, తానా కేర్స్ కో ఆర్డినేటర్‍ మల్లివేమన, న్యూజెర్సి రీజినల్‍ కో ఆర్డినేటర్‍ రాజా కసుకుర్తి ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. రేఖ ఉప్పులూరి, ప్రవీణ్‍ రెడ్డి, శ్రీ చౌదరి, రామకృష్ణ వాసిరెడ్డి, రవితేజ గరిమెళ్ళ, సుధీర్‍ నారెపాలెపు ఈ వెబ్‍ సదస్సుకు అవసరమైన ఏర్పాట్లను చేసి విజయవంతం చేశారు. ఈ వెబ్‍ సదస్సుకు మిస్‍ అయిన వాళ్ళకోసం రికార్డ్ వర్షన్‍ను తానా వాళ్ళు ఈ లింక్‍లో పెట్టారు.

TANA - WILL & TRUST BY Sunita K. Krosuri
Password: TANAWill2020
https://tananewjersey.my.webex.com/recordingservice/sites/tananewjersey.my/recording/playback/fa7e51993f954e55b198b2e47a820016

Presentation:

https://docs.google.com/presentation/d/1ePG0I61uwa2WgA4Gx46z-vkpKJ4CFTYznhXwwlitKvg/edit?usp=sharing

 

Tags :