ASBL Koncept Ambience

మహిళల ప్రతిభకు తానా జేజేలు

మహిళల ప్రతిభకు తానా జేజేలు

ఫిలడెల్ఫియా లో ఘనంగా తానా మహిళా దినోత్సవ వేడుకలు

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో మార్చ్ 7వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల్వర్న్, పెన్సిల్వేనియా లోని చార్ల్స్ టౌన్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు ఆరువందల మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. పెన్సిల్వేనియా స్టేట్ గవర్నమెంట్ రెప్రెసెంటేటివ్ క్రిస్టీన్ హోవార్డ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రంలో భాగంగా నాలుగు దశాబ్దాల నుంచి వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్ ప్రమీల మోటుపల్లి, శ్రీమతి వింధ్య వారణాసి (మహిళల క్రికెట్ టీం), పద్నాలుగేళ్లకే డిగ్రీ పూర్తి చేసి విశేష ప్రతిభతో డిగ్రీలు అందుకున్న కుమారి హిమాని దేవభక్తుని తదితరులకు తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి పురష్కారాలు అందజేశారు.  పురష్కార గ్రహీతల ఉత్తేజపూరిత ప్రసంగాలతో పాటు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వీనులవిందుగా జరిగాయి. హైస్కూల్ విద్యార్థినులు అపర్ణ వాగ్వాల, తన్మయి యలమంచిలి, మన్విత యాగంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళాభ్యున్నతికి  తానా తోడ్పాటు అందిస్తోందని మహిళల కోసం తానాలో మహిళారక్ష అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తానా స్త్రీ శక్తి భవనాలు నిర్మించి గ్రామాల్లో మహిళల అభ్యున్నతికి తానా విశేషకృషి చేస్తోందని తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి తెలిపారు. 

తానా మిడ్-అట్లాంటిక్ ఉమెన్స్ కోఆర్డినేటర్ సరోజ పావులూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మి దేవినేని, ఉమెన్స్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, సునీత వాగ్వాల, భవాని క్రొత్తపల్లి, లక్ష్మి అద్దంకి, రాజేశ్వరి కంతేటి, అనుపమ యలమంచలి, యశోద కొనగళ్ల, భవాని మామిడి, అలేఖ్య బొల్లా, తానా కార్యదర్శి రవి పొట్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, రవి మందలపు, నాగరాజు నలజుల, సతీష్ తుమ్మల, సతీష్ చుండ్రు, సుమంత్ రామిశెట్టి, సునీల్ కోగంటి, చలం పావులూరి, సాయి జరుగుల, ఫణి కంతేటి, రంజిత్, కృష్ణ నందమూరి, రామ ముద్దన, ప్రసాద్, సుధాకర్ కంద్యాల, సాంబయ్య కోటపాటి,  తదితరులు పాల్గొన్నారు. దక్కన్ స్పైస్ రెస్టారంట్ వారు విందు భోజనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్వర్ణ జెవెలర్స్, న్యూయార్క్ లైఫ్ లక్ష్మి మోపర్తి, భూమి అరకు కాఫీ, స్ప్రూస్ టెక్నాలజీస్, రవి మందలపు, హరీష్ కోయ, శ్యాంబాబు వెలువోలు ఈ కార్యక్రమ నిర్వహణకు సహాయపడ్డారు.

Click here for Event Gallery

 

Tags :