తానా ప్రపంచ స్థాయి కవితల పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ స్థాయి కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అన్నారు. ఈ పోటీలలో విజేతలకు మొత్తం లక్ష రూపాయిలు నగదు బహుమతులుగా అందజేస్తున్నామని వారు తెలిపారు. ప్రథమ బహుమతి - రూ. 30,000/-, ద్వితీయ బహుమతి - రూ. 20,000/-, తృతీయ బహుమతి - రూ. 10,000/తోపాటు, మరో పది మంది రచయితలకు రూ. 4,000/- చొప్పున నగదు పురస్కారం అందజేస్తున్నారు.
కవితలకు సంబంధించి నియమనిబంధనలను వారు తెలియజేస్తూ ఓ ఫ్లయర్‍ను వారు విడుదల చేశారు.
ఫ్లయర్‍లో ఉన్న రెండు ఫోటోలను సమన్వయం చేస్తూ కవిత రాయాలి. కవితలు 20 లైన్లకు మించి ఉండరాదు. ఒకే పేజీలో ఉండాలి. జూలై 26వ తేదీలోగా కవితలను పంపాల్సి ఉంటుంది. కవితలతోపాటు ఫోటో కూడా జత చేసి పంపాలి. కవితలు పంపాల్సిన వాట్సప్ నెంబర్ 9121081595. ఒకరు ఒక కవితనే పంపాలి. కవితలతోపాటు మీ వాట్సప్ నెం. ఇ-మెయిల్ ఐడీ, చిరునామాతోపాటు ఈ కవిత మీ స్వీయరచనే అని ధృవీకరిస్తూ సంతకం చేసి పంపాలి. విజేతల వివరాలను ఆగస్టు 15వ తేదీన ప్రకటిస్తారు. ఈ పోటీలకు సమన్వయకర్తగా చిగురుమళ్ళ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.