యువత భవిష్యత్తు కోసం తానా యూత్ కాలేజ్ అండ్ కెరీర్ ఫెయిర్!
తానా మహాసభలకు వేదిక సిద్ధమైంది. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తానా యూత్ కాలేజ్ అండ్ కెరీర్ ఫెయిర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ ఫెయిర్ జరుగుతుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రముఖ వర్సిటీల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ఉన్నత పదవుల్లో ఉన్న యువకులు ఈ ఫెయిర్‌లో పాల్గొంటారు. వీరందరూ తమ అనుభవాలను అందరితో పంచుకుంటారు. అలాగే స్పాటిఫై, జేపీమోర్గాన్, కోమ్‌క్యాస్ట్, పీడబ్ల్యూసీ తదితర ప్రఖ్యాత కంపెనీల్లో ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్‌ను కలిసే అవకాశం కూడా ఈ ఫెయిర్‌లో ఉంటుంది. ఎస్ఏటీ, ఏసీటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్‌లు, పొజిషన్ల గురించి తెలుసుకునే వీలుంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు http://bit.ly/tanacareerfair ఈ లింకులో రిజిస్టర్ చేసుకొని ఈ ఫెయిర్‌కు అటెండ్ అవ్వాలని తానా కోరుతోంది.