అలరించిన టాంటెక్స్ దీపావళి వేడుకలు, ఎస్.ఎస్. తమన్ సంగీత కచేరీ
అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసి ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేస్తున్న టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, పాలక మండల అధిపతి వెంకట్ ములుకుట్ల అధ్యక్షతన డాలస్ లో అక్టోబర్ 28వ తేదీన అలెన్ క్రెడిట్ యూనియన్ సెంటర్ లో టాంటెక్స్ దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ గారి సంగీత వ-ందం, శివమణి, నవీన్ కుమార్, మనీషా ఈరబతిని, పృధ్వీ చంద్ర, రమ్య బెహ్రా, శ్రీ కృష్ణ, శ్రీ సౌమ్య, శృతి రంజని, సాకేత్ కొమండూరి, హారిక నారాయణ్ ప్రేక్షకులని మరింత ఉత్తేజ పరిచారు. గాయని, గాయకులు సంగీత విభావరితో హై వోల్టేజ్ మరియు ఎనర్జిటిక్, నాన్ స్టాప్ పాటలతో కచేరీ నాన్ స్టాప్ 3 గంటల పాటు సాగింది. విచ్చేసిన గాయని గాయకుల ను అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు మరియు కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చము, జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించారు.
1986లో ప్రారంభమైన టాంటెక్స్ సంస్ధ, సంవత్సరం పొడుగున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మన టాంటెక్స్ అని సగర్వంగా తెలియజేసారు. 2022 సంవత్సరపు పోషక దాతలనందరిని అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రకటించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ, మీడియా మిత్రులకు టాంటెక్స్ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.