రాజమండ్రిలో వైద్యులకు మాస్క్ లను పంపిణీ చేసిన తానా
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రోగులకు సేవలందిస్తూ, చికిత్స చేస్తున్న డాక్టర్లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాస్క్లను పంపిణీ చేసింది. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ అట్లాంటిక్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రు సహకారంతో రాజమహేంద్రవరంలో జిఎస్‍ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు నేతృత్వంలో డాక్టర్ తరుణ్ ద్వారా మాస్క్లను వైద్యులకు అందజేశారు. వైద్యులతోపాటు ఇతర సిబ్బందికి కూడా మాస్క్లను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో అందరికీ మాస్క్లను అందించడానికి ముందుకు వచ్చిన తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, ఫౌండర్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, కార్యదర్శి రవి పొట్లూరి, రవి సామినేని, సతీష్ చుండ్రులకు జిఎస్‍ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్‍రావు ధన్యవాదాలు తెలిపారు.
Tags :