ASBL Koncept Ambience

ఘనంగా ముగిసిన టీసీఏ బతుకమ్మ 2023 సంబరాలు

ఘనంగా ముగిసిన టీసీఏ బతుకమ్మ 2023 సంబరాలు

అగ్రరాజ్యం అమెరికాలో టీసీఏ బతుకమ్మ 2023 సంబరాలు ఘనంగా జరిగాయి. సన్నీవ్యాలీలో అక్టోబర్ 15న, శాన్ రామోన్‌లో అక్టోబర్ 22న ఈ వేడుకలు నిర్వహించారు. సన్నీవ్యాలీలో ఎప్పట్లా ఓర్టెగా పార్కులో కాకుండా పాండెరోసా ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ లంచ్ కూడా టీసీఏ ఏర్పాటు చేసింది.అలాగే హైదరబాదీ ఇరానీ చాయ్, స్నాక్స్ కూడా అందించారు. సుమారు 800 మంది అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుకలను ఘనవిజయం చేశారు. అందరూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో మునిగి తేలారు. బతుకమ్మ పాటలు, జానపదాలతో కార్యక్రమం అంతా ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టీసీఏ ఎగ్జిక్యూటివ్ టీమ్, కోర్ గ్రూప్, వాలంటీర్లు అందరూ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిమా శ్రీకర్, శాన్ రామోన్ మేయర్ డేవిడ్ హడ్సన్, శాన్ రామోన్ కౌన్సిల్ మెంబర్లు శ్రీధర్ వెరోసె, మారిసోల్ రూబియో ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. శాన్ రామోన్‌లోని డోహర్టీ వ్యాలీ హైస్కూల్‌లో టీసీఏ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఏఐఏ దసరా, దీపావళి ఈవెంట్‌లో వేలంపాడిన ‘లక్ష్మీ లడ్డు’ను అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా టీసీఏ నిర్వహణను మెచ్చుకున్నారు.

 

Click here for Event Gallery

 

 

Tags :