ASBL Koncept Ambience

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

అక్టోబరు నెల అమెరికా తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు పండుగల నెలగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ రెండు పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు.. అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలతో నిండిపోయుంటుంది.

ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా.. మరొకటి దసరా పండుగ (విజయదశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణ సాంస్కృతిక సంఘం కి మరియు తెలంగాణకు, తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రంలోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.

ఈ ఏడాది October 5th, October 6 సాన్ ఫ్రాన్సిస్కో తెలుగు వాళ్ళకి అతిపెద్ద పండుగ 'బతుకమ్మ' సంబరాలు జరుగనున్నాయి. మనిషికి, ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను చెప్పవచ్చు. ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయదారాని అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంది. అలాంటి ప్రాస్తశ్యం బతుకమ్మ పండుగకు ఉంది.

9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది... 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో 'బతుకమ్మ' పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

బతుకమ్మ పండుగ తద్వారా తెలంగాణ సంస్కృతి ని విశ్వ వ్యాప్తి చెయ్యాలనే సదుద్దేశం తో పుట్టిన మొట్ట మొదటి అమెరికా సంఘాలలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఒక్కటి.

మరియు అమెరికాలోని మన బావి తరాలకు మన సంస్కృతి విశిష్టత తెలియ చెయ్యాలనే ఉద్దేశ్యం తో అవతరించిన తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 5th న సాన్ రామన్ లోని Gayle Ranch Middle School లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 6 వరకు, అక్టోబర్ 6th న సాన్ రామన్ లోని సన్నీ వేల్ లోని ఒర్టెగా పార్క్ బ్రతుకమ్మ ప్రాంగణం (గజెబో) లో జరిగే మెగా బతుకమ్మ పండగ కు కుటుంబ సమేతంగా వచ్చి ఈ కుటుంబ కోలాహలం లో పాలు పంచుకొమ్మని విజ్ఞప్తి.

ఈ రెండు ప్రాంతాల్లో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఈ ఉత్సవాల్ని భారత ప్రభుత్వ సహకారం తో మీ ముందుకి తీసుకు వస్తుంది . పదహారు సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి ని బే ఏరియా లో పరి రక్షిస్తూ బావి తరాలకు పరిచయం చేస్తూ తెలంగాణ సాంస్కృతిక సంఘం మీ సహాయ సహకారాల్ని ఆశిస్తుంది. Please attend in large numbers to make 16th Bathukamma festival in America a great Success.

For more details, please see www.TelanganaCulture.org

 

Tags :