తెలుగుదేశం పార్టీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తథ్యం
25ఎంపి సీట్లలో, 150పైగా అసెంబ్లీ సీట్లలో టిడిపి అభ్యర్ధులే ఘన విజయం సాధిస్తారు.
న్యూస్ ఎక్స్ ఛానల్ ఆంధ్రా పోల్ రిజల్ట్స్ సర్వే పై కూడా మాకు నమ్మకం లేదు. టిడిపి 43%, వైఎస్సార్ సి 37%, బిజెపి 7%, కాంగ్రెస్ 6%, ఇతరులు 4%, డికె/ సిఎస్ 3% గా ఆ సర్వేలో పేర్కొన్నారు. దాని ప్రకారం చూసినా టిడిపి, వైకాపా మధ్య ఓట్ల తేడా కేవలం 6%మాత్రమే చూపించారు. కానీ వాస్తవంగా చూస్తే అంతకు రెట్టింపు ఓట్ల తేడా ఉంటుంది.
గత 5ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే ‘‘సంక్షేమ విప్లవం’’ తెచ్చాం. గతంలో ప్రపంచం, మనదేశం పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవాలనే చూసింది. అలాంటిది మొదటిసారిగా ఇప్పుడు సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.
రూ.24,500కోట్ల రైతు రుణమాఫీ వల్ల 55లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగింది. ఒక్కో రైతుకు రూ.లక్షా 50వేల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తాజాగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద 60లక్షల మంది రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ప్రతినెలా ఒకటో తేదీనే పించన్లు పొందుతున్న 54లక్షల మంది వృద్దులు, వికలాంగులు,ఒంటరి మహిళలు,చేనేత,గీత కార్మికులు అందరి మద్దతు టిడిపికే ఉంది. రూ.22వేల కోట్ల ‘పసుపు-కుంకుమ’ పొందిన 90లక్షల మహిళలు తెలుగుదేశం వెంటే ఉన్నారు. ప్రతి నెలా ప్రతినెలా నిరుద్యోగ భృతి పొందుతున్న 5లక్షల మంది యువత, నైపుణ్యాభివృద్ది పొందిన 8లక్షల మంది యువత మద్దతు టిడిపికే.
రూ.2,400కోట్ల చంద్రన్న బీమా పొందిన కుటుంబాలు, రూ.5,800కోట్ల ఎన్టీఆర్ వైద్యసేవ పొందిన కుటుంబాలు, రూ.1,500కోట్ల సిఎంఆర్ ఎఫ్ పొందిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందిన విద్యార్ధులు, ఉద్యోగాలు పొందిన 9లక్షల యువతీ యువకులు, సొంత ఇళ్లలో గృహ ప్రవేశం చేసిన 11లక్షల కుటుంబాల మద్దతు టిడిపికే ఉంది.
ప్రభుత్వం చేసిన సర్వేలో, పార్టీ చేసిన సర్వేలో, ఇతర స్వచ్చంద సంస్థల అంచనాల్లో టిడిపికి 84%పైగా సంతృప్తి ప్రజల్లో ఉందనేది అనేకమార్లు వెల్లడైంది. టిడిపి అభ్యర్ధుల పర్యటనల్లో గ్రామగ్రామానా, వార్డువార్డునా ప్రజల్లో ఆదరణే పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ప్రతిబింబిస్తోంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తథ్యం. 25ఎంపి సీట్లలో, 150పైగా అసెంబ్లీ సీట్లలో టిడిపి అభ్యర్ధులే ఘన విజయం సాధిస్తారు.
కళా వెంకట్రావు
ఏపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు