ASBL Koncept Ambience

కారెక్కిన మండవ వెంకటేశ్వరరావు

కారెక్కిన మండవ వెంకటేశ్వరరావు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో మండవ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్‌కు చెందిన మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, విద్యాశాఖల మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

 

Tags :