తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు
తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని, ఏదైనా చేయగల సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందని అన్నారు. మహానాడులో పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండటాన్ని ఎప్పడూ చూడలేదు. తెలుగు వారి జీవితాల్లో వెలుగుతెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. హుద్‌హుద్ ముప్పు నుంచి బయటపడటానికి నగర వాసులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలోని సుందర నగరాల్లో విశాఖ మూడోదిగా నిలిచింది తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పునర్ అంకింతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామన్నారు.
Tags :