ASBL Koncept Ambience

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి : గల్లా

టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి : గల్లా

గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ ప్రచార జోరు పెంచారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరితో కలిసి గుంటూరు పశ్చిమలో ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. గుంటూరు నుంచే గల్లా మళ్లీ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. 69 వేల తేడాతో గల్లా జయదేవ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరు గట్టి అభ్యర్థులు కావడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

 

Tags :