ASBL Koncept Ambience

టిటిఎ ప్రెసిడెంట్‌ వంశీ రెడ్డి ఆధ్వర్యంలో టిటిఎ జాబ్‌ మేళా విజయవంతం...

టిటిఎ ప్రెసిడెంట్‌ వంశీ రెడ్డి ఆధ్వర్యంలో టిటిఎ జాబ్‌ మేళా విజయవంతం...

తెలంగాణా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టిటిఎ) తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న సేవాడేస్‌ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన జాబ్‌ మేళా విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మరియు ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని ప్రసంగించారు.

టిటిఎ ప్రెసిడెంట్‌ వంశీ రెడ్డి మాట్లాడుతూ టిటిఎ చేస్తున్న సేవలను, జాబ్‌ మేళాను వివరించారు.. ఇలాంటి అనేక కంపెనీలతో మళ్లీ మళ్లీ వరంగల్‌ లో జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

నవీన్‌ మలిపెద్ది ప్రసిడెంట్‌ ఎలెక్ట్‌ మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగరాలకు సాప్ట్‌ వేర్‌ కంపెనీలను తీసుకు రావడంలో వంశీ రెడ్డి చూపిన ప్రతిభను కొనియాడారు.

సేవా డేస్‌ కో ఆర్డినేటర్‌ సంతోష్‌ రెడ్డి మాట్లాడుతూ జాబ్‌ మేళాను మంచి స్పందన రావడం సంతోషమన్నారు.

జనరల్‌ సెక్రటరీ కవిత రెడ్డి మాట్లాడుతూ నూతనం గా ఎన్నికైన శాసనసభ్యులు రాజేందర్‌ రెడ్డి, నాగరాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. జాబ్‌ మేళా కు వచ్చిన ప్రతి ఒక్కరికీ జాబ్‌ రావాలని ఆశాభావం వ్యక్తంచేశారు.

జ్యోతి రెడ్డి టిటిఎ మహిళా నాయకురాలు హెల్త్‌ అండ్‌ వెల్‌ నేస్‌ అడ్వైసర్‌ మాట్లాడుతూ ఒక్క ఫోన్‌ కాల్‌ తో కార్యక్రమం కు విచ్చేసిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

మురళీదర్‌ రెడ్డి క్వడ్రెంట్‌ సంస్థ ఎండి మాట్లాడుతూ ఇప్పుడు జాబ్‌ లు రాని వాళ్లకు వచ్చే రోజుల్లో అవకాశాలు ఇస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ చాలా ఇన్స్పిరేషన్‌ ఇచ్చే సంస్థ టిటిఎ అని అన్నారు. స్పోర్ట్స్‌ మెన్‌ గా స్టార్ట్‌ అయిన నా జీవితం ఎస్‌ఐ నుంచి అంచలంచెలుగా ఎదిగి ఎస్పీ గా రిటైర్‌ అయ్యానని ఇప్పుడు మీ ముందుకు ఎమ్మెల్యే గా వచ్చానని తెలిపారు.. పే బ్యాక్‌ టు సొసైటీ అనే సూత్రం తో వచ్చిన టిటిఎ అద్భుతమైన సంస్థ అని తెలిపారు. వంశీ రెడ్డి తల్లి తండ్రీ తో పాటు ఆయన భార్య కృషిని ప్రశంసించారు. యువత వల్లే ఈరోజు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినదని తెలిపారు. జాబ్‌ మేళా కు వచ్చిన యువత కు అభినందనలు తెలిపారు. వంశీ రెడ్డి యువతకు రోల్‌ మోడల్‌ అని రియల్‌ హీరో వంశీ రెడ్డి అని అన్నారు.

ఎమ్మెల్యే నాయని రాజేందర్‌ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సంతోషం వేస్తుందని అన్నారు. వంశీ రెడ్డి తల్లి తండ్రికి నమస్కారం తెలిపారు.

వరంగల్‌ జాబ్‌ హబ్‌ మార్చాలని దానికి టిటిఎ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే లు వంశీ రెడ్డి అమ్మ నాన్నలకు శాలువాతో సన్మానించినారు. టిటిఎ సభ్యులు ఎమ్మెల్యే నాయని, నాగరాజు గారిని శాలువాతో సన్మానించి, మెమొంటో ఇచ్చి సత్కరించారు. 

సేవాడేస్‌ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌ గా సురేష్‌ రెడ్డి వెంకన్నగారి గారు, ఇండియా కోఆర్డినేటర్‌ గా డా. డి. ద్వారకనాథ రెడ్డి గారు, కో-కోర్డినేటర్‌ గా దుర్గా ప్రసాద్‌ సెలోజ్‌ గారు, ఫౌండేషన్‌ సర్వీస్‌ చైర్‌ గా సంతోష్‌ గంటారం గారు, ఇంటెర్నేషనల్‌ వైస్‌ ప్రసిడెంట్‌ గా ప్రసాద్‌ కునారపు గారు,హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ అడ్వైసర్‌ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు - కమ్యూనిటీ సర్వీసెస్‌ చైర్‌ గా, ప్రసిడెంట్‌ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్‌ ఎలెక్ట్‌ గా నవీన్‌ రెడ్డి మలిపెద్ది గారు, కవిత రెడ్డి - జనరల్ సెక్రటరీ గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు పలువురు టిటిఎ సభ్యులు సేవా డేస్‌ లో పాల్గొనడం జరిగింది.

 

Click here for Photogallery

 

 

Tags :