తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా, ఎనిమిదవ వార్షికోత్సవ దసరా బతుకమ్మ వేడుకలు
తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యం లో ఎనిమిదవ వార్షికోత్సవ దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పూజలు జరిపి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు, అధ్యక్షులు చందు తాళ్ల గారు మాట్లాడుతూ బతుకమ్మ అన్నది జీవ వైవిధ్యాన్ని సూచిస్తుందని, తెలంగాణా సంస్కృతికి ప్రతీకగనిలుస్తుందని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలుసుకోవడానికి తోడ్పడుతుందని, అంతే కాకుండా మహిళా సాధికారతకు కూడా బతుకమ్మ అనేది చిహ్నంగ ఉపయోగపడుతున్ధన్నారు.
తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా సంస్థ వివిధ విభాగాల్లో ప్రతిభను కనపర్చిన విద్యార్థిని, విద్యార్థులకు Dr.APJ Kalam Youth Memorial 2017 అవార్డ్స్ అందచేశారు. ఫిదా సినిమా లో నటించిన ఆర్యన్ తల్లా ను ఘనంగా సన్మానం చేసారు.
బెస్ట్ బతుకమ్మలు చేసుకొచ్చిన యువతులకు బహుమతులు అందచేశారు. సంస్థ నిర్వహించిన బతుకమ్మ తయారీ పోటీల్లో చిన్నారిబాలికలు ఉత్సాహంగా పాల్గొని పూలతో బతుకమ్మలు తయారుచేసి బహుమతులు గెలుచుకున్నారు. స్వాతి జలగం ఆధ్వర్యములో చక్కని సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వేలాది మంది స్థానికులు, అయ్యప్ప గుడివారి సహకారంతో మేళ తాళాలతో, తీన్మార్ డాన్సులతో అత్యంత వైభవంగా ఊరేగించి బతుకమ్మలను నిమజ్జనాన్ని చేసారు.
కార్యక్రమానికి తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు చందు తాళ్ల, ఉపాధ్యక్షులు అవినాష్ రామ, స్వాతి జలగం, అనిల్ బండారం, శ్రీనివాస్ గడ్డం, అశోక్ వర్ధన్, పద్మ నాగబండి, సంతోష్ గూడూరు, Dr. శ్రీనివాస్ దొంతినేని, నరేందర్ కొమ్మ, విక్రం రెడ్డి చందుపట్ల, శ్రీనివాస్ముతినేని, వెంకట్ కంచర్ల, సుమనా ఐనవోలు, లక్ష్మి చెప్యాల, శ్రీకాంత్ జలగం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పావని మరియు స్వాతి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. దాతలకు మరియు అమెరికన్ తెలంగాణ అస్సోసియేషన్, తెలంగాణ జాగృతి సంస్థలకు కృతజ్ఞతలు తెలియపరిచారు.