కెనడాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో కెనడాలో గ్రేటర్ టోరొంటోలోని పోర్టుక్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో సంక్రాతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ, తీన్మార్ సాంస్క తిక ఉత్సవాల్లో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో ఈ పండుగ సంబురాలు జరిగాయి.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీనివాసు తిరునగరి, ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు హరి రావుల్, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శి శ్రీనివాస్ మన్నెం, కోశాధికారి దామోదర్ రెడ్డి మాది, సాంస్కతిక కార్యదర్శి దీప గజవాడ, డైరెక్టర్లు మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరాల, ట్రస్టీలు సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరణ్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల, ఫౌండర్లు కోటేశ్వరరావు చిత్తలూరి, చంద్ర స్వర్గం, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రాజేశ్వర్ ఈద, అథీక్ పాషా, ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, సంతోష్ గజవాడ, నవీన్ సూదిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి చిట్యాలలు పాల్గొన్నారు.
ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా పిల్లలకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. తెలంగాణ కెనడా సంఘం నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి అనుపమ పబ్బ గెలుచుకున్నారు. సాంస్కతిక కార్యదర్శి దీప గజవాడ, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించగా సభా సమయం మొత్తానికి కుమారి మేఘ స్వర్గం, హారికలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.