ASBL Koncept Ambience

స్టాన్‌ ఫొర్డ్‌ యూనివర్సిటీలో రేవంత్‌ బృందం 

స్టాన్‌ ఫొర్డ్‌ యూనివర్సిటీలో రేవంత్‌ బృందం 

కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు, ఇతర అధికారులు ప్రఖ్యాత స్టాన్‌ ఫొర్డ్‌ యూనివర్సిటీని సందర్శించి, అక్కడి స్టాన్‌ ఫోర్డ్‌ బయర్స్‌ సెంటర్‌ ఫర్‌ బయోడిజైన్‌ విభాగం అధిపతులతో సమావేశమయ్యారు. తెలంగాణ హెల్త్‌కేర్‌ ఇన్నోవేషన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ తదితర అంశాల్లో స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంపై సీఎం బృందం చర్చలు జరిపింది. సీఎంతోపాటు మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఉన్నతాధికారులు, స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ డైరెక్టర్‌ జోష్‌ మకోవర్‌, ప్రొఫెసర్‌ అనురాగ్‌ మైరాల్‌ ఇతర ముఖ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరిశోధనలు, నూతన ఆవిష్కరణకు తోడ్పాటు ఇవ్వడంలో స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన స్కిల్‌ యూనివర్సిటీలో, గత ప్రతిపాదిత లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో కూడా స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ వారు భాగస్వాములు అయ్యే దిశగా చర్చలు జరిగాయి. లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజ్‌ ల ఉత్పత్తిలో తెలంగాణ ప్రపంచానికే కేంద్రంగా మారుతోన్న క్రమంలో రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ విభాగం ఆసక్తి కనబర్చింది. అభివృద్ధి చెందుతోన్న హెల్త్‌ కేర్‌ రంగానికి అనుగుణంగా యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని, స్టాన్‌ ఫోర్డ్‌ వారి భాగస్వామ్యం మరింత కీలకం కానుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. 

స్టాన్‌ ఫోర్డ్‌ వారి లక్ష్యాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, లైఫ్‌ సైన్సెస్‌ ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉందని మంత్రి శీధర్‌ బాబు పేర్కొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :