ASBL Koncept Ambience

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభకు పోటికి నిలిపే 17 మంది అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించింది. 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మెదక్‌ నుంచి గాలి అనిల్‌ కుమార్‌, జహీరాబాద్‌ నుంచి మదన్‌రావు, పెద్దపల్లి నుంచి ఎం.చంద్రశేఖర్‌, ఆదిలాబాద్‌ నుంచి రమేష్‌రాథోడ్‌, కరీంనగర్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌, మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాయంనాయక్‌ల పేర్లు ఖారారయ్యాయని ఏఐసీసీ ప్రతినిధి తెలిపారు. తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. కమిటీ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆమోదించాల్సి ఉంది.

 

Tags :