కువైట్ లో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు
కువైట్ దేశంలో బతుకమ్మ, దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలతో పాటు ఆంధ్ర ఆడపడుచులు సైతం సిరిసిల్ల చీరలు ధరించి బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. సిరిసిల్ల చీరలు ఎంతో బాగున్నాయని మహిళలు ప్రశంసించారు. నేత కార్మికులకు చేతినిండా పని కల్పించడంతో పాటు మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంబురాలకు ముఖ్య అతిథిగా సినీహీరో సంపూర్ణేశ్ బాబు, తెలంగాణ జానపద గాయకులు మాట్ల తిరుపతి, పారిజాత హాజరయ్యారు. కార్యక్రమంలో జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్, టీఆర్‌ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, గల్ఫ్ జాగృతి అధ్యక్షుడు హరిప్రసాద్, కమిటీ సభ్యులు ప్రమోద్‌కుమార్, సురేశ్, రాజన్న మామిడిపల్లి, రాజశేఖర్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.