టీడీపీకి నామా రాజీనామా
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తన రాజీనామా లేఖ పంపించారు. ఆ రాజీనామా లేఖను ఒకే వాక్యంతో సుదీర్ఘంగా రాశారు. ఆ లేక ఈ విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం కొరకు మీతో నేను అనేక కష్టనష్టాలకు ఓర్చి రేయింబవళ్లు కష్టపడినప్పటికీ, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ మనగడ ప్రశ్నార్థకమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో పదవికీ, నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
Tags :