ASBL Koncept Ambience

న్యూయార్క్ వీధుల్లో...నాటి రోజులను గుర్తు చేసుకున్న కేటీఆర్

న్యూయార్క్ వీధుల్లో...నాటి రోజులను గుర్తు చేసుకున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తన అమెరికా బిజీ షెడ్యూల్‌లో సైతం న్యూయార్క్‌ నగరం వెళ్లగానే అక్కడ తాను చదువుకొన్న రోజులను గుర్తుచేసుకొన్నారు. ఫైజర్‌ సీఈవోతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్‌ వీధుల్లో కాసేపు నడిచారు. విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్‌, 34 అవెన్యూలో తాను భుజించిన స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌ వద్దకు వెళ్లి, తనకు అత్యంత ఇష్టమైన వేడివేడి సాస్‌తో కూడిన చికెన్‌రైస్‌ని రుచి చూశారు. అక్కడి నుంచి ఎల్లో క్యాబ్‌లో సమావేశానికి బయలుదేరారు.

 

Tags :