తెలంగాణ మంత్రులకు ఆటా ఘన స్వాగతం
అమెరికాలో ఆటా 17వ మహాసభల్లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, రవీంద్రకుమార్, క్రాంతికిరణ్, గాదరి కిశోర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు బృందానికి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయం నుంచి మంత్రులు బస చేయనున్న హోటల్ వరకు దాదాపు 250 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో ఈ నెల 1 నుంచి 3 వరకు ఆటా సభలు కొనసాగనున్నాయి. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఆటా సభలకు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. కరోనా కారణంగా 2 ఏండ్ల విరామం తర్వాత ఆటా మహాసభలు నిర్వహిస్తున్నారు.
Tags :