ASBL Koncept Ambience

ఆటా కాన్ఫరెన్స్ లో తెలంగాణ నాయకులు

ఆటా కాన్ఫరెన్స్ లో తెలంగాణ నాయకులు

వాషింగ్టన్‌ డీసీలో అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఆటా 17వ మహాసభల్లో తెలంగాణ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సి. లక్ష్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముతిరెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్‌, గువ్వల బాలరాజ్‌, ఆళ్ళ వెంకటేశ్వర్‌ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, కాలే యాదయ్య, బీరం హర్షవర్థన్‌ రెడ్డి, జాజుల సురేందర్‌, క్రాంతి కిరణ్‌ తదితరులు ఆటా కాన్ఫరెన్స్‌కు వస్తున్నారు. మాజీ మంత్రి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య, బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌రావు కూడా వేడుకలకు వస్తున్నారు.

 

Tags :