ASBL Koncept Ambience

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

ఈ నెల 30న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు స్పీకర్ ను వారి నివాసంలో, మంత్రులను సెక్రటేరియట్ లో కలిసి వారిని ఆహ్వానించారు. ఆటా గ్రాండ్ ఫినాలే తో పాటు, 2024 జూన్ 7,8,9 తేదీలలో అమెరికా, అట్లాంటా లో నిర్వహించే కాన్ఫరెన్స్ కు కూడా హాజరై అక్కడి తెలుగు వారికి తమ అభినందనలు తెలియచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆటా కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూధిని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, నరసింహారెడ్డి ద్యాసాని, ఇండియా కో ఆర్డినేటర్ జ్యోత్స్న రెడ్డి, సిఐఐ కో ఆర్డినేటర్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :