ASBL Koncept Ambience

కెనడాలో ఉగాది వేడుకలు

కెనడాలో ఉగాది వేడుకలు

కెనడాలో తెలుగు అలయన్సస్‌ అఫ్‌ కెనడా (తాకా)  ఆధ్వర్యంలో మార్చి 25, 2023 నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను టొరంటోలోని టొరంటో పెవిలియన్‌ వేదిక నందు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిత్‌ సజ్జ, ఖాజిల్‌ మొహమ్మద్‌, విద్య భవనం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి టొరంటో పనోరమా ఇండియా చైర్మన్‌ శ్రీమతి వైదేహి భగత్‌ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. టొరంటోలో ఉన్న మన తెలుగు పూజారి నరసింహచార్యులు ఉగాది పంచాంగ శ్రవణం, ఈ కొత్త సంవత్సరం రాశి ఫలాలను అందరికీ వివరించారు.

తాకా కార్యవర్గం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు అందచేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఎన్నో విశిష్ట సేవలు తెలుగు కమ్యూనిటీకి చేస్తున్న చారి సామంతపూడి (సమాజ సేవ), దీప సాయిరాం (కళలు, సంస్కృతి), నరేంద్ర పాతూరి (తెలుగు భాష), శ్రీదేవి పిల్ల (క్రీడలు) విభాగంలో ఉగాది గౌరవ పురస్కారాలు అందించి, వైదేహి, తాకా కార్యవర్గం సత్కరించారు. తాకా కార్యవర్గం మార్చి 12న ఇన్డోర్‌ స్పోర్ట్స్‌ (చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాడ్మింటన్‌, క్యారమ్స్‌) పోటీలు అరుణ్‌ లయం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిం చడం జరిగింది. ఇన్డోర్‌ స్పోర్ట్స్‌ విజేతలు విలాస్‌ సమ్మి నేని, ప్రాణేష్‌ ఆళవందార్‌, నీలిమ, సుధా ఆర్కట్‌, బృంద భారతీరాజా, దివ్య ఆర్కట్‌, ప్రత్యు ష్‌అ శోక్‌, వివాన్‌ గోయల్‌, రామ్‌ నేర్సు, కుమార్‌ చందు, అరుణ్‌ లయం, నవీన్‌ గోవిందు, విపిన్‌ కుమార్‌, కిరణ్‌ నాయుడు,శివ చైతన్య, అవంతి మండలి, లక్ష్మీ శశి, సుధా, దివ్య, అశ్విత్‌ వరగంటి, జయ సింహ, శ్రీకాంత్‌ ఏలూరి, రాగసుమన్‌, శ్రీరామ్‌ గొర్తి, జనార్దన్‌ సదారి, సాత్విక్‌ తరలి, అభిరాం నెర్సు, అభిరాం కొండతాసుల, భారతి రాజా, అవినాష్‌,బంగారు, దివ్య కామిశెట్టి, వాసవి నగరకంటి, సౌరిస్‌ థాకల్‌, సాత్విక్‌ తారల, యశశ్విని లక్ష్మీ మొమెంటో, సర్టిఫికెట్‌ అందచేయడం జరిగింది. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు.

 

Tags :