కొలంబస్‌లో టాకో దీపావళి వేడుకలు
ఎల్లలు దాటినా మన సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకుండా తెలుగు ప్రజలు మన పండగలను విదేశాలలో అత్యంత వైభవంగా నిర్వహించుకొంటున్నారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ అఫ్ సెంట్రల్ ఒహియో(టాకో) అధ్యక్షుడు శ్రీకాంత్ మునగాల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
కొలంబస్ లోని వెస్టర్విల్ సెంట్రల్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో 1500 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు.
చిన్నారుల దీపావళి పండుగ నృత్య రూపకము, పెద్దలు చేసిన వెస్ట్రన్ డాన్స్ పెరఫార్మన్సులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాఘవేంద్ర రావుకు అంకితమిచ్చిన “సౌందర్యలహరి”, అర్ధనారీశ్వర నృత్యము వీక్షకులను కట్టిపడేసింది. అంతే కాకుండా ఆర్ పీ పట్నాయక్ మ్యూజికల్ షో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది.
2018 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేసిన తన కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మునగాల వారందరికీ జ్ఞాపికలను బహుకరించారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ దీపావళి వేడుకలకు ముఖ్య అతిధిగా congressman Balderson హాజరయ్యారు.