ASBL Koncept Ambience

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలు

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలు

శాక్రమెంటో తెలుగు సంఘం 13వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల స్థానిక ఫోల్సం నగరంలోని ఫోల్సం ఉన్నత పాఠశాలలో  ఘనంగా జరిగింది. శ్రీనివాస కళ్యానం నృత్యరూపకం, సదాశివశాస్త్రి బృందం వాయిద్య ప్రదర్శన, స్నేహ వేదుల జానపద నృత్య రూపకకం, ప్రవాస చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధానకార్షణగా నిలిచాయి. కాలిఫోర్నియా ముఖ్య సమాచార అధికారి (సిఐఓ) అమీ టోంగ్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్‌ క్యాంపస్‌ ప్రొఫెసర్‌ హనుమంతరావు ఉన్నవ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసి ప్రముఖ చిత్రకారులు, శిల్పి ఉదయ్‌ కుమార్‌ మార్లపూడి, సిలికానాంధ్ర చైర్మన్‌ ఆనంద్‌ కూచిభొట్ల, సిలికానాంధ్ర వైస్‌ చైర్మన్‌ దిలీప్‌ కొండిపర్తి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయి టాగ్స్‌ కార్యక్రమాలను అభినందించారు.

అనంతరం సంస్థ కార్యవర్గం వీరిని ఘనంగా సన్మానించింది. టాగ్స్‌ సౌజన్యంతో నిర్వహిస్తున్న శాక్రమెంటో సిలికానాంధ్ర స్థానిక మనబడి విభాగ విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు. అనంతరం వారికి అమీ టోంగ్‌ జ్ఞాపికలు అందించారు. శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రత్యేక చలనచిత్ర సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. శ్రీకృష్ణబలరాం ఆలయం నుంచి విచ్చేసిన సచ్చినంద దాస శ్రీనివాస కళ్యాణోత్సవం పూజను నిర్వహించారు. ప్రత్యేకంగా  తయారుచేసిన తీర్ధ ప్రసాదాలను భక్తులకు  టాగ్స్‌ కార్యకర్తలు అందజేశారు. టాగ్స్‌ సెక్రటరీ  మోహన్‌ కాట్రగడ్డ వందన సమర్పణ చేశారు. వేడుకల విజయవంతానికి కృషి చేసిన మనోహర్‌ మందడి, మోహన్‌ కాట్రగడ్డ, సందీప్‌ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్‌ కొప్పారపు, శ్రీరామ్‌ అకిన,  మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్‌ పగడాల శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్‌ కేతిరెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, అశ్విన్‌ తిరునాహరి, మల్లిక్‌ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్‌ వట్టి,  రాంబాబు బావిరిశెట్టి, అనిల్‌ మండవ, వెంకట్‌ నాగం, డా సంజయ్‌ యడ్లపల్లి, ఫోటోగ్రఫీ సహకారం  అందించిన రాకేష్‌ గుర్రా తదితరులకు సంస్థ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.
 

Click here for Event Gallery

 

Tags :