అమెరికాలో అట్టహాసంగా సంక్రాంతి వేడుకలు!
మెంఫిస్ తెలుగు సమితి ఆధ్వర్యంలో మెంఫిస్ మహాపట్టణంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొన్ని వందల తెలుగు కుటుంబాల పిన్నలు పెద్దలు అత్యుత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సమితి ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ పెరి, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ కిరణ్ పారపూడి తెలుగు కుటంబాలు అందిస్తున్న హార్దిక మరియు ఆర్ధిక సహాయ సహకారాల్ని అలాగే సమితి నిర్వహించే కార్యక్రమాల్ని సభ్యులు, స్పాన్సర్లు ఇతోధికంగా ప్రోత్సహించడాన్ని కొనియాడారు. గతంలో మెంఫిస్ తెలుగు సమితి భాధ్యతల్ని నిర్వహించిన శ్రీ నవీన్ మామిడిపల్లి, శ్రీ రత్నాకర్ వాన మరియు శ్రీ చిరంజీవి గొంప తమవంతు సహాయాన్ని అందించడమే కాక సంబరాల్లో పాల్గొన్న తెలుగు వారితో మమేకమయ్యారు.
మెంఫిస్ తెలుగు సమితి ఆధ్వర్యంలో మెంఫిస్ మహాపట్టణంలోనే కాదు టెన్నిస్సీ రాష్ట్రంలో దాదాపుగా గత నలభై సంవత్సరాలుగా తెలుగువారికి యెనలేని సేవ చేస్తున్న సాంస్కృతికవేదిక. సంక్రాంతి లాంటి సంబరాలు జరుపుతారు తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైన బతుకమ్మ వేడుకలు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త కార్యనిర్వాహకులు కొంగ్రొత్త ఆలోచనలతో, కార్యాక్రమాల్లో వైవిధ్యంతో ముందుకు తీసుకెళ్లడం అభినందనీయం. ప్రముఖ సాహితీవేత్తలు అందెశ్రీ మరియు గోరెటి వెంకన్న గళాలు మెంఫిస్ లో గతంలోమారుమ్రోగాయి అంటే అది మెంఫిస్తెలుగు సమితికి తెలుగు వారి సాహిత్యం, సంస్కృతి, కళలపట్ల ఉన్న మక్కువ.
ప్రతిసంవత్సరం ఉగాది వేడుకలు, వనభోజనాలు, అడపాతడప సాహిత్య సమారాధనలు, మహిళా దినోత్సవాలు, స్వాతంత్ర దినోత్సవం, పిల్లల దినోత్సవం, ఇవికాక క్రికెట్, వాలీ బాల్, టెన్నిస్, క్యారంబోర్డు టోర్నమెంట్స్. సంవత్సరం పొడుగూతా పిల్లలకి పెద్దవారికి, ఇంకా చెప్పాలంటే ఇండియానుంచి వచ్చే తల్లితండ్రులు మెచ్చే అన్ని కార్యక్రమాలు చేస్తుంది మెంఫిస్తెలుగు సమితి.
సంక్రాంతి ఉత్సవాలు ఆలస్యంగా జరిగిన మాట వాస్తవమే కానీ ఆటలు, పాటలు, చిన్నారులకి భోగిపళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాడుతా తీయగా వేదికమీద తన గళంతో శ్రోతల విశేష అభిమానం చూరగొన్న శ్రీకాంత్ సందుగు పాటలతో సంబరాలు అంబరాన్ని తాకాయి.
ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకి ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాలకువెస్ట్ కాళీర్వీల్లెమిడిల్ స్కూల్ వేదికగా నిలచింది. ఎనెన్నో కార్యక్రమాలతో మెంఫిస్ ఔత్సాహిక కళాకారులు ప్రేక్షకుల విశేష అభిమానం చూరగొన్నారు. ఘుమఘుమ లాడే వంటకాలతోవిందు భోజనం తో మెంఫిస్ తెలుగు సమితి వారి ఈ సంక్రాంతి కార్యక్రమం దీప కుండవజ్జుల, మహేష్ నందికంటి, ఫని తీగలపల్లి, రోహిణి కల, అనిల్ బయన్న కార్య నిర్వాహక సభ్యుల సహకారంతో ముగిసింది.
Dr. Ramana Vasili
Spiritual Foundation, INc.
7062 S. Beringer Drive
Cordova, TN 38018
901-387-9646 ramanavvasili@hotmail.com