ASBL Koncept Ambience

తెలుగు భాషాభిమానం పెంచేలా సాహిత్య కార్యక్రమాలు

తెలుగు భాషాభిమానం పెంచేలా సాహిత్య కార్యక్రమాలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా తెలుగు భాషాభిమానులకోసం సాహిత్య కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

తెలుగు భాషా కదంబం పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగులో అనువాద సాహిత్యంపై పి. సత్యవతి ప్రసంగించనున్నారు. సమకాలీన సాహిత్యంలో మాండలికాలపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఫరినియా అట్టాడ, స్వామి వెంకట యోగి, భూషణ్‌ తమ్మినేని మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా సుధాకర్‌ ఉప్పల వ్యవహరిస్తున్నారు.

ప్రవాసంలో తెలుగుభాషా బోధనపై చర్చా కార్యక్రమాన్ని సాహిత్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో శ్యామలాదేవి దశిక, రమ గబ్బిట, వేణు ఓరుగంటి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా దివాకర్‌ పేరి వ్యవహరిస్తున్నారు. 

సాహిత్య సౌరభం పేరుతో మరో సాహిత్య కార్యక్రమాన్ని లిటరేచర్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కథ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. పుస్తక పరిచయం డాక్టర్‌ రొంపిచర్ల భార్గవి చేయనున్నారు. వందేళ్ళ రావి శాస్త్రీయంపై డాక్టర్‌ కలశపూడి శ్రీనివాసరావు మాట్లాడనున్నారు. తెలుగు సాహిత్యంలో పద్యనాటకాల పాత్ర అనే అంశంపై డాక్టర్‌ మీగడ రామలింగస్వామి మాట్లాడనున్నారు. 

 

 

Tags :