ASBL Koncept Ambience

బాటా ఉగాది సంబరాలలో తెలుగు టైమ్స్‌ 20 వసంతాల వేడుక..

బాటా ఉగాది సంబరాలలో తెలుగు టైమ్స్‌ 20 వసంతాల వేడుక..

Click here for Event Gallery

52 సంవత్సరాల బే ఏరియా తెలుగు సంఘం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా మిల్పిటాస్‌ నగరం లోని ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌ లో కిక్కిరిసిన (హౌస్‌ ఫుల్‌) ప్రేక్షకులతో ఘనంగా జరిగాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 వరకు దాదాపు 400 మందికి పైగా చిన్నారులు, యువతి యువకుల డాన్స్‌ లతో, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ ఉగాది పండగ ఉత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చిన భారతదేశ కాన్సల్‌ జనరల్‌ డా. టీ వీ నాగేంద్ర ప్రసాద్‌ తెలుగు కమ్యూనిటీకి తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది సంబరాలలో ముఖ్య అతిధి నాగేంద్ర ప్రసాద్‌ చేతులమీదుగా తెలుగు టైమ్స్‌ 20 సంవత్సరాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ సుబ్బా రావు చెన్నూరి మాట్లాడుతూ తెలుగు టైమ్స్‌ 20 సంవత్సారాల క్రితం బే ఏరియాలో జరిగిన తానా సభలో పుట్టిందని, ఇన్నేళ్లుగా బే ఏరియా తెలుగు సంఘంతో స్నేహసంబంధం కొనసాగుతోందని బాటా - తెలుగు టైమ్స్‌ సంస్థలు మిత్ర సంస్థలుగా ఉన్నాయని చెబుతూ, బాటా కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తెలుగు వారికి తెలుగు పత్రిక అందించాలన్న ఆశయంతో, ఫ్రీ పత్రిక గా తెలుగు టైమ్స్‌ని 20 సంవత్సరాలుగా నడపటం చాల కష్టమైన పని అని, ఆ పని ని ఆనందంగా చేస్తున్న సుబ్బారావుని బాటా అడ్వయిజర్‌ విజయ ఆసూరి ప్రశంసించారు. ఆ తరువాత ఇండియన్‌ కాన్సల్‌ జనరల్‌ శ్రీ నాగేంద్ర కుమార్‌ - తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ శ్రీ సుబ్బా రావు చెన్నూరి కలిసి 20 సంవత్సర సంచిక విడుదల సందర్భంగా తయారు చేసిన ప్రత్యేక కేక్‌ ని కట్‌ చేసి వేడుకను పూర్తి చేశారు. 

 

Tags :