మరో 3 రోజుల్లో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు
తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలకోసం మరో 3 రోజులు వేచి ఉండాలి. అంగరంగ వైభవంగా మొదటిసారిగా డల్లాస్‌లోని అతిథి వెన్యూలో, జూన్ 15 శనివారంనాడు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి ఒక్కొక్కటిగా ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకోసం భారత కాన్సుల్ జనరల్, డి.సి. మంజునాథ్ హ్యూస్టన్ నుండి డల్లాస్‌కు వస్తున్నారు. విప్రోలో ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు నాగేంద్ర బండారు కీ నోట్ స్పీకర్‌గా వస్తున్నారు. గ్రోత్ ఈక్విటీ హెడ్ రాజా దొడ్డాల, గౌరవ అతిథిగా వస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వక్తల ప్రసంగాలను కూడా మీరు వినవచ్చు.
Topic: Success in Technology Leadership & Future of AI,
FIRESIDE CHAT (Topic: VC Funding for Emerging Tech Firms & Growth Equity)
ఈ చర్చాకార్యక్రమాలకు మోడరేటర్‌గా ఇంటెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ సిఇఓ సతీష్ మండువ ఉన్నారు.
ప్లానో మేయర్ జాన్ బి. మున్స్‌తోపాటు ఇర్వింగ్, ఫ్రిస్కో సిటీ నుండి కొంతమంది అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, అండ్ సి మాజీ సలహాదారు జె.ఎ చౌదరి, తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, ఆటా మాజీ అధ్యక్షుడు జి ఆత్మ చరణ్ రెడ్డి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపు నూతి, నాటా మాజీ అధ్యక్షుడు శ్రీధర్ కొర్సపాటి, ఐటీ సర్వ్ అలయన్స్ మాజీ అధ్యక్షుడు సతీష్ మండువతోపాటు ఇతర తెలుగు కమ్యూనిటీ, బిజినెస్ లీడర్స్ వస్తున్నారు.
ఈ వేడుకలను టీవీ9లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి 5 కెమెరాల సిబ్బంది పని చేస్తున్నారు. అమెరికాలో ఇతర నగరాల్లో ఉన్న ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించవచ్చు. ఇండియాలో ఉన్న వారు క్లిప్‌ల ద్వారా వేడుకల వివరాలను చూడవచ్చు.
ఇప్పుడు అందరి దృష్టి ఎవరికి ఏ అవార్డు లభిస్తుందన్న విషయమే. దీనిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
ఐటీ సేవలకు అవార్డు ఎవరికి లభిస్తుంది?
సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వనున్నారు?
రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఎవరు అవార్డులు పొందుతున్నారు?
అవార్డు అందుకునే వెంచర్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఏవీ?
హోటల్-రెస్టారెంట్ విభాగం, లీగల్ సర్వీసెస్ ఫర్మ్, కమ్యూనిటీ సర్వీస్ కంపెనీలు, హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ విభాగాల్లో ఎవరు అవార్డు అందుకోనున్నారు?
డల్లాస్‌లోని స్నేహితులు/వ్యాపార యజమానులు రిజిస్టర్ చేసుకుని, ఈవెంట్‌కు హాజరుకావాలని మేము కోరుకుంటున్నాము.
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్ అండ్ సిఇఓ, తెలుగు టైమ్స్, యుఎస్‌ఎ