తెలుగు టైమ్స్ యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభం
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి 20 సంవత్సరాలకుపైగా మీడియాపరంగా సేవలందిస్తూ, అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్లకు కరపత్రంగా ఉన్న ‘తెలుగు టైమ్స్’ చరిత్రలో మరో మైలురాయిగా తెలుగు టైమ్స్ యూ ట్యూబ్ ఛానల్ నిలిచింది. 2003లో అమెరికాలో ఆటా, తానా మహాసభల్లో ఆవిష్కృతమై పత్రిక రూపంలో అమెరికాలోని తెలుగు ఎన్నారైలను అలరించిన తెలుగు టైమ్స్ 2013లో పోర్టల్ రూపంలో, ఇ-పేపర్ రూపంలో ఎన్నారైల ముందుకు వచ్చింది. ఇప్పుడు తెలుగుటైమ్స్ యూ ట్యూబ్ ఛానల్‌తో దృశ్యపరంగా కూడా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు వచ్చింది. తెలుగు టైమ్స్ యూ ట్యూబ్ ఛానల్‌ను డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పారామంలో తానా కళారాధన కార్యక్రమంలో ప్రముఖ గాయని సుశీల చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా పలువురు తానా నాయకులు, సినీనటీనటులు, ఇతర ప్రముఖులు తెలుగు టైమ్స్‌కు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు, న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్, డిజైనర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్, వెబ్ డిజెనర్ సురేష్, సబ్ ఎడిటర్ సైదులు, యూ ట్యూబ్ విభాగం సబ్ ఎడిటర్ కృష్ణ, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ భార్గవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://www.youtube.com/@telugutimesyoutubechannel