ASBL Koncept Ambience

టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

అమెరికా లోని టెన్నిస్సీ రాష్త్రం, నాష్విల్ల్ లో వున్న టెన్నిస్సీ తెలుగు సమితి ఆద్వర్యం లో జరిగిన ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి. తెలుగు వారందరు అంచనాకు మించి సుమారు 1000 కు మించి ఉగాది సంబరాలను పిల్లలతో పాటుగా పెద్దలు సాంస్క్రుతిక, నృత్య ప్రదర్శనల తో ఆనందొత్సవాలతో ఆత్మీయంగా జరుపుకొన్నారు.

ప్రత్యెక అతిధి మేయర్ కెన్ మూర్ మన సాంస్క్రుతి, సాంప్రదాయాలు ను చుసి ఆనందించి మన తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. మరీ ముఖ్యంగా సింగర్ కల్యాణ్ గారు మరియు తన టీము తో పాటు లొకల్ సింగర్స్ తో పాడిన పాటలు, చిన్న పిల్లల సాంస్క్రుతిక కార్యక్రమాలుకు మేయర్ కెన్ మూర్ ఆనందించి తన జీవితం లొ మరువలెని రొజు అని ప్రసంసించి ఆనందించి ప్రత్యెక ఆహ్వానం అందించినదుకు శ్యామ్ జేలం ని ప్రసంసించారు.

టెన్నిస్సీ తెలుగు సమితి ప్రెసిడెంట్ శ్యామ్ జేలం ప్రత్యెకం గా 29 సంవత్సరాల నుంచి ఈ సమితి ని స్తాపించి పనిచెసిన పాత ప్రెసిడెంట్స్ అందరిని ఒకటె వెదిక మీదకు తెచ్చి వారిని సన్మానించి మొమెంటొల తో సత్కరించి గౌరవించారు.

స్టార్ట్ అప్ బిసినెస్స్ వాళ్ళను ని ఎంకరెజ్ చెయ్యటానికి స్టాల్ల్స్ కొసం ఎర్పాట్లు చెసారు మరియు ఉగాది రెస్టరెంట్ వాళ్లు వచ్చిన అతిదులకు విందు సదుపాయం చెసారు. ఈ కార్యక్రమం విజయం కావటానికి నాష్విల్ల్ లో వున్న రెస్టరెంట్స్ ఇతర బిసినెస్స్ వాళ్ళు తమ సహాయ సహకారాలు ఎప్పుడు అందించినట్లుగానె ఇప్పుడు కూడా అందించారు.

మరీ ముఖ్యంగా స్వాతి పొలెపల్లి ఈ సాంస్క్రుతిక కార్యక్రమాలు విజయవంతం కావటానికి వెనుక వుండి నడిపించింది మరియు శైలజ జాలెం స్టెజ్ అందంగా వుండటానికి తన వంతు సహాయ సహకారాలు అందించారు.

ఈ కార్యక్రమం విజయం కావటానికి మా కమ్యునిట్య్ మెంబెర్స్ మంజుల లిక్కి గారు సెక్రటరీ, వేణు ఆలోకం కోశాధికారి, అనూరాధ గారు, స్వాతి గారు, దీప గారు, శ్రీరంజని గారు, శిల్ప గారు, శిరీష గారు, నిషిత గారు, వంశీ, దినేష్, గణేష్ రావెళ్ల,మనోహర్, శ్రీకర్, రజనీకాంత్, రవు గారు,శ్రీరాం లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలా మన పెద్దలు. పూర్వపు తెలుగు సమితి అధ్యక్షులు చక్రధర రావు కొడాలి గారు,రమేష్ ఆరమండ్ల గారు, మధు పరుచూరి గారు, ఆష వల్లభనేని గారు,ప్రసాద్ పోలవరపు గారు, రాధ బాబు గారు, సత్యనారాయణ వడ్లమూడి గారు, మాధవి మల్లిపెద్ది గారు, గరీష్ రాచకొండ గారు, రాజేష్ నారాయణదాస్ గారు.దీప్తి రెడ్డి దొడ్ల గారు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మరియు ఈ విజయంలొ తమ వంతు సహయ సహకారాలు అందించినారు.

ఈ విజయంలొ కిషోర్ తుమ్మల (టెన్నిస్సీ తెలుగు సమితి వెబ్ సైట్),హేమంత్ వీరమాచినెని (టెన్నిస్సీ తెలుగు సమితి డైరెక్టరి),నవీన్ (స్పొర్ట్స్),బాల,శివ, మహేంద్ర,వెంకట్ గడ్డం,ఉమ సప్పిడి,శ్రీనివాస్ కొనకళ్ళ,ప్రకాష్, క్రిష్ ఆలపటి, నాగ పసుమర్తి, వీరు ముక్కు తమ వంతు సహయ సహకారాలు అందించినారు. విచ్ఛేసిన ప్రతి తెలుగు వారు తమ కుటుంబం లాగా చిన్న లొటు పాట్ల ను పట్టించుకొకుండ తమ వంతు సహయ సహకారాలు అందించినందుకు టెన్నిస్సీ తెలుగు సమితి శ్యామ్ జేలం వారినుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags :