ASBL Koncept Ambience

ముచ్చింతల్ లో శ్రీవారి దివ్యక్షేత్రం ప్రారంభం

ముచ్చింతల్ లో శ్రీవారి దివ్యక్షేత్రం ప్రారంభం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో త్రిదండి చిన్న జీయర్‌ స్వామి నిర్మించిన 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారి దివ్య క్షేత్రాన్ని ప్రారంభించారు. శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన వస్త్రం, తీర్థ ప్రసాదాలను టీటీటీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి చిన్నజీయర్‌ స్వామికి అందించారు. ఆయన వస్త్రాన్ని శ్రీవారి విగ్రహానికి అలంకరించారు. శాసనసభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, కాటసాని రాంభూ పాల్‌రెడ్డి, దేవస్థానం విద్యాధికారి గోవిందరాజన్‌, సికింద్రాబాద్‌ ఓరియంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హేమంత్‌ కుమార్‌ ఈ కాక్యక్రమంలో పాల్గొన్నారు.

 

Tags :