తానా క్యూరీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
ఉత్తర అమెరికా తెలుగు సరఘం (తానా) 22వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అమెరికావ్యాప్తంగా నిర్వహించిన తానా-క్యూరీ పోటీల విజేతలకు వర్జీనియాలోని హెర్న్‌డన్ క్యూరీ ప్రధాన కార్యాలయంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా-క్యూరీ గణితం, సైన్స్, స్పెల్ బీ, కంప్యూటర్ కోడింగ్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్న 64మంది విద్యార్థులకు, నాలుగు, అయిదవ స్థానాలు పొందిన 57మంది విద్యార్థులకు పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో తానా 22వ మహాసభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, తానా అధ్యక్షుడు సతీష్ వేమన, తానా-క్యూరీ పోటీల జాతీయ సమన్వయకర్త మరియు సలహాదారురాలు వేమురి గౌరి తదితరులు పాల్గొని విద్యార్థులకు పురస్కారపత్రాలను అందించారు.
Tags :